sathyavelugu.com
Date of Publish : 09 October 2026, 4:16 pm Posted by : Dr.K.Suresh Editor

బీసీ 34 శాతం రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతులకు (బీసీ) 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ అంశంపై ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదంటూ గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది.

సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, న్యాయస్థానాల తీర్పులు ఎలా ఉన్నప్పటికీ బీసీలకు రాజకీయంగా అండగా ఉంటామని స్పష్టం చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ అభ్యర్థులకు పార్టీ తరఫున అధిక సంఖ్యలో సీట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.

ఇదే సమయంలో, బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే ప్రయత్నాలను వైసీపీ అడ్డుకుందని చంద్రబాబు ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో బీసీ రిజర్వేషన్లు 34 శాతం నుంచి 24 శాతానికి తగ్గడంతో సుమారు 16,800 రాజకీయ పదవులను బీసీలు కోల్పోయారని ఆయన పేర్కొన్నారు.