sathyavelugu.com
Date of Publish : 25 October 2026, 10:13 pm Posted by : Dr.K.Suresh Editor

మీలో ఒకడిగా.. మీ కష్టాల్లో తోడుగా ఉంటా! 22వ వార్డు స్వతంత్ర అభ్యర్థి బురకాల లీలామోహన్ ఓటు అభ్యర్థన

నాయుడుపేట, అక్టోబర్ 25 ,సత్య వెలుగు న్యూస్:నాయుడుపేట మున్సిపాలిటీలోని 22వ వార్డు స్వతంత్ర అభ్యర్థి బురకాల లీలామోహన్ వార్డులో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలను నేరుగా కలుసుకుంటూ తనకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు.

ఈ సందర్భంగా బురకాల లీలామోహన్ మాట్లాడుతూ, “మీ మధ్యనే పెరిగిన వాడిని.. మీలో ఒకడిని. మీ కష్టాలు, సమస్యలు నాకు తెలుసు. మీ ఆదరణతో గెలిచి ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించండి” అని కోరారు.

తాగునీరు, డ్రైనేజీ, రహదారులు వంటి మౌలిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఎన్నికల సమయంలోనే కాకుండా, ఎన్నికల తర్వాత కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సుఖదుఃఖాల్లో పాలుపంచుకుంటానని భరోసా ఇచ్చారు.

ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, 22వ వార్డు అభివృద్ధికి నిరంతరం కృషి చేయడమే తన లక్ష్యమని పేర్కొంటూ, తనను ఆదరించి ఆశీర్వదించాలని బురకాల లీలామోహన్ వార్డు ప్రజలను కోరారు.