మీలో ఒకడిగా.. మీ కష్టాల్లో తోడుగా ఉంటా! 22వ వార్డు స్వతంత్ర అభ్యర్థి బురకాల లీలామోహన్ ఓటు అభ్యర్థన
నాయుడుపేట, అక్టోబర్ 25 ,సత్య వెలుగు న్యూస్:నాయుడుపేట మున్సిపాలిటీలోని 22వ వార్డు స్వతంత్ర అభ్యర్థి బురకాల లీలామోహన్ వార్డులో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలను నేరుగా కలుసుకుంటూ తనకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా బురకాల లీలామోహన్ మాట్లాడుతూ, “మీ మధ్యనే పెరిగిన వాడిని.. మీలో ఒకడిని. మీ కష్టాలు, సమస్యలు నాకు తెలుసు. మీ ఆదరణతో గెలిచి ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించండి” అని కోరారు. తాగునీరు, డ్రైనేజీ, రహదారులు వంటి మౌలిక సమస్యల పరిష్కారానికి...