sathyavelugu.com
Date of Publish : 10 October 2026, 8:38 am Posted by : Dr.K.Suresh Editor

నవజీవన్ ఆర్గనైజేషన్ – సి.సి – పి.యు – ప్రాజెక్టు ఆధ్వర్యంలో హెచ్ఐవి/ఎయిడ్స్ పై అవగాహన

సత్య వెలుగు న్యూస్,సూళ్లూరుపేట | సెప్టెంబర్ 9:

సూళ్లూరుపేటలోని మూడు పాఠశాలల్లో హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆదేశాల మేరకు తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, దిశా విభాగం సహకారంతో నవజీవన్ ఆర్గనైజేషన్ – సి.సి – పి.యు ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు చేపట్టారు.

ఇంటెన్సిఫైడ్ ఐఈసీ క్యాంపెయిన్‌లో భాగంగా జెడ్‌పీ గర్ల్స్ హైస్కూల్, వీఎస్‌ఎస్‌సీ హోలీ క్రాస్ హైస్కూల్, శ్రీ రామకృష్ణ విద్యాలయాల్లో అవగాహన సదస్సులు నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రాజెక్టు మేనేజర్ కె. బాలాజీ మాట్లాడుతూ హెచ్‌ఐవీ/ఎయిడ్స్ వ్యాప్తి మార్గాలు, నివారణ చర్యలు, లక్షణాలు, చికిత్స, సుఖవ్యాధులు, డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే అనర్థాల గురించి వివరించారు. హెచ్‌ఐవీతో జీవిస్తున్న వారిపట్ల వివక్ష చూపకుండా, వారిని సమాజంలో సమానంగా గౌరవించాలని సూచించారు.

అలాగే హెచ్‌ఐవీ/ఎయిడ్స్ చట్టం–2017, ఏఆర్‌టీ మందులు, ఏపీ శాక్స్ యాప్, క్యూఆర్ కోడ్, సెల్ఫ్ రిస్క్ అసెస్‌మెంట్, టోల్‌ఫ్రీ నంబర్ 1097 గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సమాచారాన్ని ఇతరులకు కూడా తెలియజేయాలని కోరారు.

ఈ కార్యక్రమాల్లో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ఓఆర్‌డబ్ల్యూ సిబ్బంది టి. నందిని, కె. మంజుల, పీఈలు, సుమారు 200 మంది విద్యార్థులు పాల్గొన్నారు.