నిర్లక్ష్యానికి నిదర్శనంగా బంగారంపేట సచివాలయ భవనం
-ఐదేళ్లుగా ప్రారంభ దశలోనే నిర్మాణ పనులు.. తుప్పుపట్టిన ఇనుపకమ్మీలు -పొదలు, చెట్లతో నిండిపోయిన నిర్మాణ ప్రదేశం పెళ్లకూరు, అక్టోబర్ 7, సత్య వెలుగు న్యూస్ : పెళ్లకూరు మండలం బంగారంపేట గ్రామంలో నూతన సచివాలయ భవన నిర్మాణ పనులు ప్రారంభించి ఐదేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ పూర్తికాకపోవడంపై గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణ పనులు ప్రారంభ దశలోనే నిలిచిపోవడంతో భవన నిర్మాణానికి వినియోగించిన ఇనుపకమ్మీలు తుప్పుపట్టిపోయాయి. నిర్మాణ ప్రదేశం మొత్తం చెట్లు, పొదలతో నిండిపోయి అధ్వానంగా మారింది. ఏళ్ల తరబడి భవన నిర్మాణం వైపు...