పుంగనూరు, అక్టోబర్ 1 (సత్య వెలుగు న్యూస్): అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలో బీసీవై పార్టీ నేత హరినాథ్ రెడ్డి టీడీపీలో చేరారు. పలమనేరు ఎమ్మెల్యే అమర్‌నాథ్ రెడ్డి సమక్షంలో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ మధుసూదన్ నాయుడు ఆధ్వర్యంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమర్‌నాథ్ రెడ్డి హరినాథ్ రెడ్డికి పార్టీ కండువా కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. అనంతరం హరినాథ్ రెడ్డి మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై టీడీపీలో చేరినట్లు తెలిపారు. పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.