నాయుడుపేటలో నూతన మున్సిపల్ భవనానికి భూమిపూజ

-రూ.21 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ సత్య వెలుగు న్యూస్, నాయుడుపేట:నాయుడుపేట పట్టణంలో నూతన మున్సిపల్ భవన నిర్మాణానికి భూమిపూజ నిర్వహించడంతో పాటు, పట్టణ అభివృద్ధి కోసం రూ.21 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పనులకు సూళ్లూరుపేట నియోజకవర్గ శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా HAM పద్ధతిలో చేపట్టనున్న అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాన్ని ఆమె ఆవిష్కరించారు. నాయుడుపేటలోని పాత తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో నూతన మున్సిపల్ భవన నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు....