నాయుడుపేటలో నూతన మున్సిపల్ కార్యాలయ భవనానికి రేపు భూమిపూజ
-రూ. 3.40 కోట్ల HAM నిధులతో నూతన భవన నిర్మాణం నాయుడుపేట, అక్టోబర్ 12, సత్య వెలుగు న్యూస్:నాయుడుపేట పట్టణంలో నూతన మున్సిపల్ కార్యాలయ భవన నిర్మాణానికి రేపు (అక్టోబర్ 13, మంగళవారం) ఉదయం 10 గంటలకు భూమిపూజ కార్యక్రమం నిర్వహించనున్నట్లు నాయుడుపేట పురపాలక సంఘం కమిషనర్ తెలిపారు. పాత ఎమ్మార్వో కార్యాలయ స్థలంలో రూ. 3 కోట్ల 40 లక్షల HAM (హైబ్రిడ్ యాన్యుటీ మోడల్) నిధులతో నూతన మున్సిపల్ కార్యాలయ భవనాన్ని నిర్మించనున్నారు. ఈ కార్యక్రమానికి సూళ్లూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల...