పెళ్లకూరు మండలంలో బీజేపీ కార్యవర్గ సమావేశం పార్టీ బలోపేతం, కార్యకర్తల సమన్వయం, ప్రజా సమస్యలపై చర్చ

పెళ్లకూరు, అక్టోబర్ 4 (సత్య వెలుగు న్యూస్): భారతీయ జనతా పార్టీ పెళ్లకూరు మండల కార్యవర్గ సమావేశం పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాసులు, మండల ఇన్‌చార్జి ముని సుబ్రహ్మణ్యం, జిల్లా ఉపాధ్యక్షులు ఎద్దల నరేంద్రరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, మండల స్థాయిలో కార్యకర్తల సమన్వయం, ప్రజా సమస్యలపై చేపట్టాల్సిన కార్యక్రమాలపై నాయకులు మార్గనిర్దేశం చేశారు. రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త...