“మీ ఇంటి ఆడబిడ్డగా ఆశీర్వదించి గెలిపించండి”

-నాయుడుపేట 13వ వార్డు వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థి మేడిద రత్నశ్రీ ఇంటింటి ప్రచారం నాయుడుపేట, సత్య వెలుగు న్యూస్:నాయుడుపేట మున్సిపాలిటీ 13వ వార్డు వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ అభ్యర్థి మేడిద రత్నశ్రీ సోమవారం వార్డులో విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతి ఇంటికి వెళ్లి మహిళలు, పెద్దలను కలుసుకుంటూ తనను తమ ఇంటి ఆడబిడ్డగా భావించి ఆశీర్వదించాలని కోరారు. ప్రచార సమయంలో పలుచోట్ల మహిళలు హారతులు పట్టి ఆమెకు మద్దతు తెలిపారు. యువతులు, వృద్ధులు ఆమెను ఆశీర్వదించడంతో ప్రచారం కొనసాగింది....