sathyavelugu.com
Date of Publish : 17 October 2026, 4:19 pm Posted by : Dr.K.Suresh Editor

మూల నక్షత్రం సందర్భంగా సరస్వతీ దేవి అలంకారంలో దర్శనమిచ్చిన బోయకొండ గంగమ్మ

-బోయకొండలో వైభవంగా దసరా నవరాత్రి ఉత్సవాలు..

-ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహణ

చౌడేపల్లి, అక్టోబర్ 17, సత్య వెలుగు న్యూస్:అన్నమయ్య జిల్లాలో ప్రముఖ శక్తి క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానంలో దసరా నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. 2026 దసరా మహోత్సవాల్లో భాగంగా ఆరవ రోజు, అక్టోబర్ 17న మూల నక్షత్రాన్ని పురస్కరించుకుని అమ్మవారు శ్రీ సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు.

కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా భక్తులచే పూజలందుకుంటున్న బోయకొండ గంగమ్మ సన్నిధిలో ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉభయదారుల సహకారంతో గణపతి హోమం, చండీ హోమం నిర్వహించారు. వేదమంత్రాల నడుమ జరిగిన పూజా కార్యక్రమాలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది.

ఉభయదారులుగా పాల్గొన్న ప్రముఖులు

ఆరవ రోజు ఉత్సవాల్లో భాగంగా శ్రీ విజయవాణి ప్రింటర్స్, చౌడేపల్లి; శ్రీమతి కె. శశికళ, శ్రీ ప్రకాష్ రెడ్డి, యనమసామనపల్లి; శ్రీమతి ఆర్. శంకరమ్మ, మాజీ సర్పంచ్‌ ఆర్. రెడ్డెప్ప, మిట్టూరు; శ్రీమతి నాగమణి, కనమర్లపూడి దాము, ప్రభు ఇండస్ట్రీస్, పుంగనూరు; శ్రీమతి లక్ష్మి, పి. శ్రీధర్, పద్మావతి జ్యూవెల్లర్స్, పుంగనూరు; శ్రీ బాలాజీ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, సేఫెస్ట్ పెయింట్స్/లీబాండ్ అడ్హెసివ్స్, మదనపల్లి వారు ఉభయదారులుగా పాల్గొన్నారు.

అలాగే శ్రీమతి ఎస్. పద్మావతి, మాజీ ఎంపీపీ ఎస్. రెడ్డి ప్రకాష్, చౌడేపల్లి; శ్రీమతి ఆర్. జ్యోతమ్మ అండ్ సన్స్, తిరుపతి; శ్రీ అయ్యప్పన్, ములబాగాలు; శ్రీమతి ఆర్.సి. తిరుమల, జి. భాస్కర్ నాయుడు, మదనపల్లి; శ్రీమతి పద్మావతి, మోహన్, ఇండియన్ గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్, చౌడేపల్లి; శ్రీమతి జ్యోతి రాణి, నాయుని గురుప్రసాద్, శ్రీ విజయవాణి ప్రింటర్స్, చౌడేపల్లి; శ్రీమతి పి. మోక్షావతి, గోపీనాధ్ యాదవ్, అనంతపురం; శ్రీమతి గీతాదేవి, లబురామ్, శ్రీ భవాని జ్యూవెల్లర్స్, పుంగనూరు వారు ఉభయదారులుగా పాల్గొన్నారు.

భక్తులకు తీర్థప్రసాదాల పంపిణీ

ఈ కార్యక్రమంలో దేవస్థాన ఉప కమిషనర్, కార్యనిర్వహణాధికారి జె. ఏకాంబరం, దేవస్థాన అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. ఉభయదారులకు తీర్థప్రసాదాలు అందజేసి, శ్రీ అమ్మవారి దర్శన భాగ్యాన్ని కల్పించారు.

సరస్వతీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో ముంచెత్తింది. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి.