మూల నక్షత్రం సందర్భంగా సరస్వతీ దేవి అలంకారంలో దర్శనమిచ్చిన బోయకొండ గంగమ్మ
-బోయకొండలో వైభవంగా దసరా నవరాత్రి ఉత్సవాలు.. -ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహణ చౌడేపల్లి, అక్టోబర్ 17, సత్య వెలుగు న్యూస్:అన్నమయ్య జిల్లాలో ప్రముఖ శక్తి క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానంలో దసరా నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. 2026 దసరా మహోత్సవాల్లో భాగంగా ఆరవ రోజు, అక్టోబర్ 17న మూల నక్షత్రాన్ని పురస్కరించుకుని అమ్మవారు శ్రీ సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా భక్తులచే పూజలందుకుంటున్న బోయకొండ గంగమ్మ...