తిరుపతి మేయర్‌ అభ్యర్థిగా కాంగ్రెస్‌ పార్టీ నుంచి CH. శివశంకర్‌ నామినేషన్‌

తిరుపతి, సత్య వెలుగు న్యూస్:తిరుపతి నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ మేయర్‌ అభ్యర్థిగా CH. శివశంకర్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ మేరకు ఎన్నికల అధికారికి తన నామినేషన్‌ పత్రాలను సమర్పించారు. తిరుపతి నగరంలో కాంగ్రెస్‌ పార్టీ తరఫున మేయర్‌ అభ్యర్థిగా శివశంకర్‌ ఎన్నికల బరిలో నిలిచారు. నామినేషన్‌ దాఖలుతో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మరింత పెరిగింది.