స్థానిక ఎన్నికల సమన్వయ బాధ్యతల్లో చింతపూడి పవన్ కళ్యాణ్,-తిరుపతి పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల కోఆర్డినేషన్ కమిటీ సభ్యుడిగా ప్రతిపాదన
పెళ్లకూరు, అక్టోబర్ 11,సత్య వెలుగు న్యూస్: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే దిశగా పెళ్లకూరు మండలం చిల్లకూరు గ్రామానికి చెందిన జనసేన నాయకుడు చింతపూడి పవన్ కళ్యాణ్‌కు కీలక బాధ్యతలు అప్పగించే ప్రతిపాదన ముందుకు వచ్చింది. తిరుపతి పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల స్థానిక ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీ సభ్యుడిగా ఆయన పేరును ప్రతిపాదించినట్లు పార్టీ వర్గాల సమాచారం. జనసేన పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు, సూళ్లూరుపేట నియోజకవర్గ జనసేన సమన్వయకర్త ఉయ్యాల...