పుత్తూరు మున్సిపల్ ఎన్నికల్లో మూడు వార్డుల్లో పోటీకి సీపీఎం పార్టీ నిర్ణయం

పుత్తూరు , సత్య వెలుగు న్యూస్: పుత్తూరు పట్టణంలోని సీపీఎం పార్టీ కార్యాలయంలో ఆర్. వెంకటేష్ అధ్యక్షతన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు దాసరి జనార్ధన్ మాట్లాడుతూ, రానున్న పుత్తూరు మున్సిపల్ ఎన్నికల్లో సీపీఎం పార్టీ మూడు వార్డుల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ప్రజా సమస్యలే పార్టీ అజెండా మున్సిపాలిటీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలే తమ పార్టీ ప్రధాన అజెండా అని దాసరి జనార్ధన్ పేర్కొన్నారు. సామాన్య ప్రజలు...