మహనీయుల విగ్రహాల వద్ద చేపల మార్కెట్‌పై విమర్శలు
నాయుడుపేట, అక్టోబర్ 4 (ఆదివారం) — సత్య వెలుగు న్యూస్: నాయుడుపేట పట్టణంలోని పాత బస్టాండ్ ఆవరణలో మహనీయుల విగ్రహాల ఏర్పాటు కోసం కేటాయించిన స్థలం సమీపంలో చేపల విక్రయాలు నిర్వహించడంపై పట్టణ ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మహనీయుల స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రధాన కూడళ్లలో విగ్రహాలను ఏర్పాటు చేయడంతో పాటు వాటి పరిసరాలను పరిశుభ్రంగా, గౌరవప్రదంగా ఉంచాల్సిన బాధ్యత మున్సిపల్ అధికారులపై ఉందని ప్రజలు పేర్కొంటున్నారు. పాత బస్టాండ్ ఆవరణలో సామాజిక న్యాయానికి ప్రతీకగా నిలిచిన బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్...