స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయకర్తగా చిన్నా రాయల్‌కు బాధ్యతలు, అవకాశం కల్పించిన పవన్ కళ్యాణ్‌కు సీవీ గంగాధర్ కృతజ్ఞతలు

పుంగనూరు టౌన్, అక్టోబర్ 12 ,సత్య వెలుగు న్యూస్: స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయ బాధ్యతల్లో భాగంగా పుంగనూరు అసెంబ్లీ కమిటీలో సమన్వయకర్తగా తనకు అవకాశం కల్పించిన జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్కు జనసేన పార్టీ పుంగనూరు నియోజకవర్గ ఇన్‌చార్జి సీవీ గంగాధర్ (చిన్నా రాయల్) హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. తనపై నమ్మకం ఉంచి కీలక బాధ్యతను అప్పగించిన పార్టీ అధిష్ఠానానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. పార్టీ ఆశయాలకు అనుగుణంగా నాయకులు, జనసైనికులు, వీరమహిళలు, కూటమి పార్టీల...