నగరి, అక్టోబర్ 2, సత్య వెలుగు న్యూస్:
రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని నిండ్ర మండల వైఎస్సార్‌సీపీ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, యువతతో మాజీ మంత్రి ఆర్కే రోజా సమీక్ష సమావేశం నిర్వహించారు. నగరిలోని ఆమె నివాసంలో ఈ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా ఆర్కే రోజా మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పార్టీ నాయకత్వాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి పంచాయతీలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల విజయానికి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని అన్నారు.
ప్రతి పంచాయతీలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత సమన్వయంతో పనిచేస్తూ పార్టీ అభ్యర్థులకు అండగా నిలవాలని సూచించారు. పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తే దానిని తన విజయంగా భావిస్తానని రోజా పేర్కొన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు ఇప్పటి నుంచే పంచాయతీల వారీగా కార్యాచరణ రూపొందించుకుని, పార్టీ శ్రేణులందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని ఆమె సూచించారు.
ఈ సమావేశంలో నిండ్ర మండల వైఎస్సార్‌సీపీ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, యువత పాల్గొన్నారు.