స్థానిక సంస్థల ఎన్నికలపై నిండ్ర మండల వైఎస్సార్‌సీపీ నాయకులతో రోజా సమీక్ష

నగరి, అక్టోబర్ 2, సత్య వెలుగు న్యూస్: రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని నిండ్ర మండల వైఎస్సార్‌సీపీ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, యువతతో మాజీ మంత్రి ఆర్కే రోజా సమీక్ష సమావేశం నిర్వహించారు. నగరిలోని ఆమె నివాసంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆర్కే రోజా మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పార్టీ నాయకత్వాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి పంచాయతీలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల విజయానికి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని...