పుదిపట్ల శ్రీ వైష్ణవి దేవి ఆలయంలో మహా చండి అలంకారంలో అమ్మవారి దర్శనం

-నాలుగో రోజు నవరాత్రి వేడుకలు.. -ప్రత్యేక పూజలు, లలితా సహస్రనామ పారాయణంతో ఆధ్యాత్మిక శోభ చౌడేపల్లి, అక్టోబర్ 14 | సత్య వెలుగు న్యూస్:పుదిపట్ల గ్రామంలో వెలసిన ప్రముఖ స్వయంభు శ్రీ వైష్ణవి దేవి ఆలయంలో దసరా నవరాత్రి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన బుధవారం అమ్మవారు మహా చండి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి దివ్యరూపాన్ని దర్శించుకున్న భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. శాస్త్రోక్తంగా పంచామృత అభిషేకం ఉదయాన్నే ఆలయ అర్చకురాలు శ్రావణి ఆధ్వర్యంలో అమ్మవారికి శాస్త్రోక్తంగా పంచామృత...