sathyavelugu.com
Date of Publish : 11 October 2026, 7:39 pm Posted by : Dr.K.Suresh Editor

నాయుడుపేటలో అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి

-ముఖంపై గాయాలు.. పక్కనే రక్తసిక్తమైన బండరాయి

సత్య వెలుగు న్యూస్, నాయుడుపేట:నాయుడుపేట పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి వెనుక ఉన్న ఖాళీ స్థలంలో ఆదివారం ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై ఎం. శివశంకరరావు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.

మృతుడి ముఖంపై గాయాలు ఉండటంతో పాటు, సమీపంలో రక్తసిక్తమైన బండరాయి పడి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. మృతుడిని తిరుపతి జిల్లా ఓజిలి మండలం కారూరు గ్రామానికి చెందిన బాల గోవిందు (28)గా గుర్తించారు.

బాల గోవిందును ముగ్గురు వ్యక్తులు కొట్టి హత్య చేశారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే, యువకుడి మృతికి గల అసలు కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టగా, పూర్తి వివరాలు దర్యాప్తులో వెల్లడికానున్నాయి.