పాలచూరు చెరువులో తూము నిర్మాణం ఆలస్యం.. పంటలపై రైతుల్లో ఆందోళన

-20 రోజులు గడిచినా పూర్తికాని పనులు.. -చెరువులో నీరు వృథా అవుతుందేమోనని ఆందోళన పెళ్లకూరు, అక్టోబర్ 3 – సత్య వెలుగు న్యూస్: పెళ్లకూరు మండలం పాలచూరు గ్రామ చెరువుకట్టకు సంబంధించిన తూము నిర్మాణ పనులు ఆలస్యం కావడంతో గ్రామస్తులు, రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తూము నిర్మాణం కోసం సుమారు 20 రోజుల క్రితం చెరువుకట్టను తొలగించినప్పటికీ, ఇప్పటివరకు పనులు పూర్తికాకపోవడంపై గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం చెరువులోని నీటి మట్టం క్రమంగా తగ్గుతుండటంతో రానున్న రోజుల్లో పంటలకు సాగునీరు అందుతుందా లేదా...