sathyavelugu.com
Date of Publish : 02 October 2026, 10:06 pm Posted by : Dr.K.Suresh Editor

పుత్తూరులో వామపక్షాల నిరసన, ఎన్నికల ప్రక్రియపై ఆరోపణల నేపథ్యంలో సీఈసీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్

పుత్తూరు, అక్టోబర్ 2, సత్య వెలుగు న్యూస్:
తిరుపతి జిల్లా పుత్తూరు పట్టణంలో ఎన్నికల ప్రక్రియపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా, పారదర్శకంగా వ్యవహరించాలని వారు డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా సీపీఐ పుత్తూరు మండల కార్యదర్శి డి. మహేష్, సీపీఎం డివిజన్ కార్యదర్శి ఆర్. వెంకటేష్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థకు ఎన్నికల ప్రక్రియ పునాది వంటిదని, ఎన్నికల సంఘంపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉండేలా అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన బాధ్యత ఉందన్నారు.

ఎన్నికల ప్రక్రియలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయని వారు పేర్కొన్నారు. బీజేపీకి అనుకూలంగా ఓట్ల చోరీకి పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని వారు డిమాండ్ చేశారు.

ఎన్నికల సంఘం స్వతంత్రత, పారదర్శకతపై ప్రజలకు పూర్తి నమ్మకం కలిగే విధంగా ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. ఓటు హక్కు ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన హక్కు అని, ఆ హక్కును పరిరక్షించడం ఎన్నికల సంఘం ప్రధాన బాధ్యత అని అన్నారు.

ఎన్నికల ప్రక్రియపై వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావాలని వామపక్ష నాయకులు డిమాండ్ చేశారు.