పుత్తూరులో వామపక్షాల నిరసన, ఎన్నికల ప్రక్రియపై ఆరోపణల నేపథ్యంలో సీఈసీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్

పుత్తూరు, అక్టోబర్ 2, సత్య వెలుగు న్యూస్: తిరుపతి జిల్లా పుత్తూరు పట్టణంలో ఎన్నికల ప్రక్రియపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా, పారదర్శకంగా వ్యవహరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సీపీఐ పుత్తూరు మండల కార్యదర్శి డి. మహేష్, సీపీఎం డివిజన్ కార్యదర్శి ఆర్. వెంకటేష్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థకు ఎన్నికల ప్రక్రియ పునాది వంటిదని, ఎన్నికల సంఘంపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉండేలా అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన బాధ్యత ఉందన్నారు....