చెత్త నుండి సంపద తయారీ కేంద్రాల పరిశీలించిన డిప్యూటీ ఎంపీడీవో గఫూర్

చౌడేపల్లి, అక్టోబర్ 8, సత్య వెలుగు న్యూస్: మండల పరిధిలోని దుర్గసముద్రం, పెద్దయల్లకుంట్ల గ్రామ పంచాయతీల్లోని చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను చౌడేపల్లి మండల డిప్యూటీ ఎంపీడీవో గఫూర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేంద్రాల్లో వర్మీ కంపోస్ట్ (వానపాముల ఎరువు) తయారీ విధానాన్ని పరిశీలించారు. క్లాప్ మిత్రులకు వర్మీ కంపోస్ట్ తయారీ, నిర్వహణపై పలు సూచనలు, సలహాలు అందించారు. అనంతరం స్వయంగా వర్మీ తొట్టెల్లో వానపాములను విడుదల చేశారు. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణను మరింత మెరుగుపరచడంతో పాటు, తడి...