ఢిల్లీలో క్షీణిస్తున్న గాలి నాణ్యత
- శీతాకాలం ముందే కాలుష్యంపై అప్రమత్తమైన అధికారులు - నగరవ్యాప్తంగా యాంటీ డస్ట్ తనిఖీలు ముమ్మరం - దుమ్ము నియంత్రణకు కఠిన చర్యలు న్యూఢిల్లీ, అక్టోబర్ 7 : దేశ రాజధాని ఢిల్లీలో శీతాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో గాలి నాణ్యత క్రమంగా క్షీణిస్తోంది. ఇటీవల రోజుల్లో గాలి నాణ్యత సూచీ 140 నుంచి 150 మధ్య నమోదవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వాతావరణంలో కాలుష్య కణాల మోతాదు పెరుగుతున్న సంకేతాలు కనిపించడంతో ముందస్తు చర్యలను మరింత వేగవంతం చేస్తున్నారు. ప్రతి ఏడాది శీతాకాలంలో ఎదురయ్యే కాలుష్య...