sathyavelugu.com
Date of Publish : 12 October 2026, 8:43 am Posted by : Dr.K.Suresh Editor

నిండ్ర మండల వైఎస్సార్‌సీపీ నాయకులకు కేడర్ ఐడీ కార్డుల పంపిణీ, స్థానిక సంస్థల ఎన్నికలకు సంసిద్ధంగా ఉండాలని ఆర్కే రోజా పిలుపు

నగరి,సత్య వెలుగు న్యూస్: రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సంసిద్ధంగా ఉండాలని మాజీ మంత్రి, నగరి నియోజకవర్గ సమన్వయకర్త ఆర్కే రోజా పిలుపునిచ్చారు.

నగరి నియోజకవర్గంలోని నిండ్ర మండలానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులకు ఆర్కే రోజా చేతుల మీదుగా పార్టీ కేడర్ ఐడీ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ ఐకమత్యంగా ముందుకు సాగాలని సూచించారు.

గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు, నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో నిండ్ర మండల వైఎస్సార్‌సీపీ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.