sathyavelugu.com
Date of Publish : 01 October 2026, 8:16 pm Posted by : Dr.K.Suresh Editor

ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ

చిట్టమూరు, అక్టోబర్ 1 (సత్య వెలుగు న్యూస్): చిట్టమూరు మండలం అదిపూడి గ్రామంలో గురువారం ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. టీడీపీ నాయకుడు చిగురువాడ మురళీధర్ చేతుల మీదుగా పెన్షన్లు అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవ్వా, తాతలు, వితంతువులు, దివ్యాంగులు, ఇతర అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం ప్రతి నెలా 1వ తేదీన పెన్షన్లు అందిస్తోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సామాజిక భద్రత పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, పెన్షన్‌దారులు పాల్గొన్నారు.