కొండాపురం మోడల్ ప్రైమరీ స్కూల్కు జిల్లా స్థాయి ఉత్తమ పాఠశాల అవార్డు
వాకాడు, అక్టోబర్ 3 — సత్య వెలుగు న్యూస్: వాకాడు మండలం కొండాపురం మోడల్ ప్రైమరీ స్కూల్ జిల్లా స్థాయిలో ఉత్తమ పాఠశాల అవార్డును సొంతం చేసుకుంది. పాఠశాలలో విద్యా ప్రమాణాలు, విద్యార్థుల ప్రతిభ, మెరుగైన ఫలితాల సాధనకు చూపిన ప్రత్యేక శ్రద్ధకు గుర్తింపుగా ఈ అవార్డు లభించింది. ఈ విజయానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈ. వెంకటేశ్వర్లు అందించిన సేవలు ప్రధాన కారణమని స్థానికులు, విద్యాభిమానులు పేర్కొన్నారు. ఆయన ఎక్కడ పనిచేసినా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తూ, మెరుగైన ఫలితాలు సాధించేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని...