నామినేషన్ కేంద్రాన్ని తనిఖీ చేసిన డీఎస్పీ
పెళ్లకూరు, సత్య వెలుగు న్యూస్:పెళ్లకూరు మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎంపీటీసీ నామినేషన్ కేంద్రాన్ని సూళ్లూరుపేట డీఎస్పీ చెంచుబాబు, రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సంఘమేశ్వరరావు బుధవారం తనిఖీ చేశారు. నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై పోలీసు సిబ్బందికి పలు సూచనలు చేశారు. నామినేషన్ కేంద్రం వద్ద పటిష్టమైన బారికేడ్లు ఏర్పాటు చేసి, తగిన పోలీసు బందోబస్తు నిర్వహించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా డీఎస్పీ చెంచుబాబు మాట్లాడుతూ ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని...