దుర్గమ్మ దర్శనం సామాన్య భక్తులకు కరువేనా?
-కూటమి నాయకులకే ప్రాధాన్యమంటూ భక్తుల ఆవేదన.. -గంటల తరబడి క్యూలైన్లలో నిరీక్షణ విజయవాడ, సత్య వెలుగు న్యూస్:విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాల తొలిరోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి దర్శనం కోసం వేలాది మంది భక్తులు తరలిరావడంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. అయితే, గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండాల్సి రావడంతో సామాన్య భక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. గంటల తరబడి క్యూలైన్లలో భక్తుల నిరీక్షణ కుమ్మరిపాలెం సెంటర్ నుంచి కెనాల్ రోడ్డులోని...