బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పు తర్వాతే ఎన్నికలు, 123 మున్సిపాలిటీల ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక ప్రకటన

-గోదావరి పుష్కరాలకు రూ.2,000 కోట్లు -రాజమహేంద్రవరం అభివృద్ధికి రూ.1,000 కోట్లు -2028 నాటికి అమరావతి నిర్మాణ పనులు పూర్తి చేసేలా చర్యలు అమరావతి, అక్టోబర్ 3 — సత్య వెలుగు న్యూస్: స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతులకు (బీసీలకు) 34 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో, న్యాయస్థానం తీర్పు అనంతరం రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించే అంశంపై నిర్ణయం తీసుకుంటామని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తెలిపారు. అమరావతిలో శనివారం మీడియాతో మాట్లాడిన...