ఆన్లైన్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి
-విద్యార్థులకు సైబర్ క్రైమ్, డ్రగ్స్, ర్యాగింగ్‌పై అవగాహన కల్పించిన ఎస్సై శివశంకర్ పాలసముద్రం, అక్టోబర్ 7 ,సత్య వెలుగు న్యూస్: ఆన్లైన్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పాలసముద్రం ఎస్సై శివశంకర్ సూచించారు. పాలసముద్రం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు సైబర్ క్రైమ్, డ్రగ్స్, ర్యాగింగ్, క్రమశిక్షణ తదితర అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై శివశంకర్ మాట్లాడుతూ, ఇంటర్నెట్, కంప్యూటర్ లేదా మొబైల్ ఫోన్లను ఉపయోగించి మోసాలకు పాల్పడటాన్ని సైబర్ నేరంగా పేర్కొన్నారు. బాధితుల వ్యక్తిగత సమాచారాన్ని...