శ్రీసిటీలో బాయిలర్ పేలుడు.. ఐదుగురు మృతి మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా

శ్రీసిటీ: శ్రీసిటీలోని టిల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో జరిగిన బాయిలర్ పేలుడు ఘటనలో ఐదుగురు మృతి చెందినట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.50 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించనున్నట్లు ప్రకటించారు. దీంతో మొత్తం రూ.2.5 కోట్ల పరిహారం అందించనున్నారు. పరిశ్రమలో 2 టన్నుల బాయిలర్ పేలడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు కలెక్టర్ వెల్లడించారు. బాయిలర్‌ను ఫిట్‌గా ధ్రువీకరించిన ఇన్‌స్పెక్టర్ రాంబాబును సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఘటనపై సమగ్ర విచారణ కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. పరిశ్రమ...