106 పట్టణ స్థానిక సంస్థల్లో బీఎస్పీ పోటీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు.. మున్సిపాలిటీల్లో పార్టీ బలోపేతానికి చర్యలు

కోట, అక్టోబర్ 3 — సత్య వెలుగు న్యూస్: రాష్ట్రంలోని 106 పట్టణ స్థానిక సంస్థల్లో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) పోటీకి సిద్ధమవుతోంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ నాయకత్వం అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించింది. ఆయా మున్సిపాలిటీలు, పట్టణ ప్రాంతాల్లో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. స్థానికంగా పార్టీకి ఉన్న బలాబలాలు, అభ్యర్థుల సామాజిక నేపథ్యం, ప్రజల్లో ఉన్న పరిచయం, పార్టీ కార్యక్రమాల్లో చురుకైన పాత్ర వంటి అంశాలను...