sathyavelugu.com
Date of Publish : 09 October 2026, 5:01 pm Posted by : Dr.K.Suresh Editor

రాజగోపాలపురం ఐదో వీధి రోడ్డు విస్తరణ నిలిపివేయాలి

సత్య వెలుగు న్యూస్ – నాయుడుపేట:

నాయుడుపేట పురపాలక సంఘం మాస్టర్ ప్లాన్‌లో రాజగోపాలపురం ఐదో వీధి రోడ్డు విస్తరణ ప్రతిపాదనను తొలగించాలని స్థానిక నివాసులు పట్టణ ప్రణాళిక అధికారి బాలసుబ్రమణ్యంకు వినతిపత్రం అందజేశారు. రోడ్డు విస్తరణ చేపడితే అనేకమంది పేద కుటుంబాలు నివాసాలు కోల్పోతాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజలకు అవసరమైన రహదారులకు ప్రాధాన్యత ఇవ్వాలని, దర్గా కూడలి నుంచి వచ్చే మూడో వీధిని కూడా విస్తరణ ప్రతిపాదనల్లో పరిశీలించాలని కోరారు. మాస్టర్ ప్లాన్‌ను పునఃపరిశీలించి, ఐదో వీధి విస్తరణను నిలిపివేసేలా తుడా అధికారులకు ప్రతిపాదనలు పంపాలని పురపాలక అధికారులు, పట్టణ ప్రణాళిక విభాగాన్ని విజ్ఞప్తి చేశారు.