sathyavelugu.com
Date of Publish : 06 October 2026, 6:55 pm Posted by : Dr.K.Suresh Editor

చిట్టమూరు మండలంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు

చిట్టమూరు, సత్య వెలుగు న్యూస్: ఎమ్మెల్యే, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ పాశిం సునీల్ కుమార్ ఆదేశాల మేరకు మండల పార్టీ అధ్యక్షుడు గణపర్తి కిషోర్ నాయుడు ఆధ్వర్యంలో చిట్టమూరు మండలంలోని పలు పంచాయతీల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు నిర్వహించారు.

మల్లాం పంచాయతీ పరిధిలోని వల్లిపురంలో సీసీ రోడ్ల నిర్మాణంతో పాటు పబ్లిక్ హెల్త్ సెంటర్ నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. అనంతరం అరూరు, తాడిమెడు, అరవపాలెం, చిల్లమూరు, యాకసిరి, మెట్టు పంచాయతీల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేపట్టారు.

మండలంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు.