చిట్టమూరు మండలంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన, రూ.58 లక్షలతో పీహెచ్సీ ల్యాబ్.. రూ.51 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం
చిట్టమూరు, అక్టోబర్ 5: గూడూరు ఎమ్మెల్యే, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ పాశిం సునీల్ కుమార్ ఆదేశాల మేరకు చిట్టమూరు మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షుడు గణపర్తి కిషోర్ నాయుడు ఆధ్వర్యంలో చిట్టమూరు, యల్లసిరి, కొగిలి గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. చిట్టమూరు గ్రామంలో రూ.58 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన పబ్లిక్ హెల్త్ సెంటర్ (పీహెచ్సీ) ల్యాబ్‌కు, అలాగే రూ.1.40 లక్షలతో పీహెచ్సీ భవనం పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా యల్లసిరి గ్రామపంచాయతీలో...