-కూటమి ప్రభుత్వ నాయకత్వానికి జువ్వలపాటి ఉష విజ్ఞప్తి
నాయుడుపేట,s : నాయుడుపేట పట్టణ పరిధిలోని 31వ వార్డు కౌన్సిలర్‌గా పోటీ చేసేందుకు కూటమి ప్రభుత్వం తనకు అవకాశం కల్పిస్తే, ప్రజల ఆదరణతో గెలిచి వార్డు అభివృద్ధికి, ప్రజాసేవకు కృషి చేస్తానని జువ్వలపాటి ఉష తెలిపారు.
తన భర్త జువ్వలపాటి మస్తాన్ నాయుడుపేట పట్టణంలో ప్రముఖ బీసీ నాయకుడిగా ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉన్నారని ఆమె పేర్కొన్నారు. ఆయన సహకారంతో 31వ వార్డులో ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యలను గుర్తించి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.
కౌన్సిలర్‌గా అవకాశం లభిస్తే నిజాయితీ, నిబద్ధతతో ప్రజలకు సేవ చేస్తానని, వార్డు అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ కూటమి ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని ఆమె వెల్లడించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వ నాయకులు, సంబంధిత పార్టీ పెద్దలు తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించి, నాయుడుపేట 31వ వార్డు కౌన్సిలర్‌గా పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని జువ్వలపాటి ఉష విజ్ఞప్తి చేశారు.