కడసారి చూపు కోసం వెళ్తూ.. కానరాని లోకాలకు! రోడ్డు ప్రమాదంలో పోలీస్ హెడ్‌ కానిస్టేబుల్‌ దుర్మరణం

నాయుడుపేట, అక్టోబర్ 6,: తెలిసిన వ్యక్తి మృతి చెందడంతో కడసారి చూపు కోసం బయలుదేరిన ఓ పోలీస్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ మార్గమధ్యంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన నేలబల్లి గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. వివరాల్లోకి వెళితే.. నేలబల్లి గ్రామానికి చెందిన గోను ప్రసన్నకుమార్‌ అలియాస్‌ నందబాబు (54) ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ 9వ బెటాలియన్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. వెంకటగిరి డివిజన్‌ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఆయన, తెలిసిన వ్యక్తి మృతి చెందిన విషయం తెలుసుకుని కడసారి చూపు కోసం...