చౌడేపల్లి గాంధీ వీధిలో ఘనంగా గాంధీ జయంతి, వాసవి వనిత క్లబ్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీకి ఘన నివాళులు
చౌడేపల్లి, అక్టోబర్ 2, సత్య వెలుగు న్యూస్: చౌడేపల్లి గాంధీ వీధిలో వాసవి వనిత క్లబ్ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. యువత అహింసా మార్గాన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వాసవి వనిత క్లబ్ సభ్యులు, ఆర్యవైశ్య సంఘం నాయకులు, మహిళా మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.