బోయకొండ గంగమ్మ ఆలయంలో ఘనంగా వరుణ యాగం – వరుణ జపం

చౌడేపల్లి, అక్టోబర్ 5, సత్య వెలుగు న్యూస్: అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలంలోని ప్రముఖ శక్తి క్షేత్రం శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానంలో రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ “వరుణ యాగం – వరుణ జపం” కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు వేద పండితుల సమక్షంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, వరుణ యాగం, వరుణ జపం నిర్వహించారు. రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని, రైతుల కుటుంబాల్లో ఆనందం...