sathyavelugu.com
Date of Publish : 22 October 2026, 10:25 am Posted by : Dr.K.Suresh Editor

సూళ్లూరుపేట ఎమ్మెల్యేకు పుట్టినరోజు శుభాకాంక్షలు


నాయుడుపేట  | సత్య వెలుగు న్యూస్:

సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీకు నాయుడుపేట తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బల్లి ముత్యాలయ్య పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించి, ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా బల్లి ముత్యాలయ్య మాట్లాడుతూ ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ జీవితంలో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని, ప్రజలకు నిరంతరం సేవలందిస్తూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు.