sathyavelugu.com
Date of Publish : 29 October 2026, 8:44 am Posted by : Dr.K.Suresh Editor

సూళ్లూరుపేట చెంగాళమ్మ ఆలయ హుండీ ఆదాయం రూ.69.15 లక్షలు

–107 రోజుల హుండీ కానుకల లెక్కింపు పూర్తి

నాయుడుపేట, అక్టోబర్ 28 ,సత్య వెలుగు న్యూస్:భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతున్న సూళ్లూరుపేట శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో హుండీ లెక్కింపు (పరకామణి) కార్యక్రమాన్ని నిర్వహించారు. గత 107 రోజులుగా భక్తులు అమ్మవారికి సమర్పించిన కానుకలను లెక్కించగా, మొత్తం రూ.69,15,109 నగదు ఆదాయం సమకూరినట్లు ఆలయ సహాయ కమిషనర్, కార్యనిర్వహణాధికారి బి. ప్రసన్నలక్ష్మి వెల్లడించారు.

బంగారం, వెండి, విదేశీ కరెన్సీ కానుకలు

హుండీ లెక్కింపులో నగదుతో పాటు భక్తులు సమర్పించిన 18 గ్రాముల 250 మిల్లీగ్రాముల బంగారం, 193 గ్రాముల 50 మిల్లీగ్రాముల వెండి లభించినట్లు అధికారులు తెలిపారు. అలాగే విదేశీ కరెన్సీ రూపంలో ఒక అమెరికా డాలర్, 100 కెనడా డాలర్లు, 115 అరబ్ దిర్హామ్‌లు, 250 థాయ్ బాత్‌లు లభించినట్లు వివరించారు.

అధికారుల పర్యవేక్షణలో లెక్కింపు

తిరుపతి దేవాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ పి. ఫణిరాజ్ పర్యవేక్షణలో, ఆలయ సహాయ కమిషనర్, కార్యనిర్వహణాధికారి బి. ప్రసన్నలక్ష్మి సమక్షంలో హుండీ లెక్కింపు ప్రక్రియను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన సిబ్బందితో పాటు పోలీసు, రెవెన్యూ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.

అలాగే మెప్మా సభ్యులు, శ్రీ రామలింగ చౌడేశ్వరి దేవి మహిళా సేవా సమితి సభ్యులు, శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి భక్త బృందం సభ్యులు, విశ్రాంత బ్యాంకు ఉద్యోగులు హుండీ లెక్కింపు కార్యక్రమంలో భాగస్వాములయ్యారు.

భక్తులు సమర్పించిన కానుకల ద్వారా అమ్మవారి ఆలయానికి గణనీయమైన ఆదాయం సమకూరినట్లు అధికారులు వెల్లడించారు.