సూళ్లూరుపేట చెంగాళమ్మ ఆలయ హుండీ ఆదాయం రూ.69.15 లక్షలు

-107 రోజుల హుండీ కానుకల లెక్కింపు పూర్తి నాయుడుపేట, అక్టోబర్ 28 ,సత్య వెలుగు న్యూస్:భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతున్న సూళ్లూరుపేట శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో హుండీ లెక్కింపు (పరకామణి) కార్యక్రమాన్ని నిర్వహించారు. గత 107 రోజులుగా భక్తులు అమ్మవారికి సమర్పించిన కానుకలను లెక్కించగా, మొత్తం రూ.69,15,109 నగదు ఆదాయం సమకూరినట్లు ఆలయ సహాయ కమిషనర్, కార్యనిర్వహణాధికారి బి. ప్రసన్నలక్ష్మి వెల్లడించారు. బంగారం, వెండి, విదేశీ కరెన్సీ కానుకలు హుండీ లెక్కింపులో నగదుతో పాటు భక్తులు సమర్పించిన 18 గ్రాముల 250 మిల్లీగ్రాముల...