చౌడేపల్లి పట్టణంలో 18వ రోజుకు చేరిన వీఆర్‌ఏల నిరవధిక సమ్మె

-న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని తహశీల్దార్ కార్యాలయం ఎదుట వినూత్న నిరసన చౌడేపల్లి, అక్టోబర్ 3 — సత్య వెలుగు న్యూస్: రెవెన్యూ శాఖలో ఏళ్ల తరబడి సేవలు అందిస్తున్న గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్‌ఏలు) చేపట్టిన నిరవధిక సమ్మె శనివారంతో 18వ రోజుకు చేరుకుంది. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ వీఆర్‌ఏల సంఘం ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన శిబిరం వద్ద ఒంటికాళ్లపై నిలబడి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వీఆర్‌ఏల సమస్యల...