స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రం పరిశీలన , ఎంపీడీవో, ఎంఆర్ఓ, ఎస్‌ఐ సంయుక్త తనిఖీ

పెళ్లకూరు, సత్య వెలుగు న్యూస్:నాయుడుపేట మండలం తుమ్మూరు గ్రామంలోని జెడ్పీ హైస్కూల్‌లో ఏర్పాటు చేయనున్న స్ట్రాంగ్ రూమ్, ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని ఎంపీడీవో, తహసీల్దార్ (ఎంఆర్ఓ), ఎస్‌ఐ సంయుక్తంగా పరిశీలించారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ గదుల ఏర్పాట్లను తనిఖీ చేశారు. ఎన్నికలకు సంబంధించిన కీలక సామగ్రి భద్రత, ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అవసరమైన సౌకర్యాలు, గదుల అనుకూలత తదితర అంశాలను పరిశీలించారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించారు....