చౌడేపల్లి మండలం లద్దిగంలో స్వెచ్ఛా సంకల్పం – స్వచ్ఛ భారత్ ప్రాజెక్ట్ షెడ్ పరిశీలన
చౌడేపల్లి, అక్టోబర్ 7, సత్య వెలుగు న్యూస్: మండలంలోని లద్దిగం గ్రామ పంచాయతీలో బుధవారం డిప్యూటీ ఎంపీడీవో ఎస్.ఎ.గఫూర్ పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని 'సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్' షెడ్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో భాగంగా షెడ్‌లోని చెత్త వర్గీకరణ, నిర్వహణ తీరును పరిశీలించిన ఆయన, తడి చెత్త నుండి నాణ్యమైన వర్మీ కంపోస్ట్ తయారీపై పలు ముఖ్యమైన సూచనలు చేశారు. గ్రామాల్లో సేకరించే చెత్తను సక్రమంగా వర్గీకరించి, ఎరువుగా మార్చడం ద్వారా పంచాయతీకి అదనపు ఆదాయం లభించడమే...