sathyavelugu.com
Date of Publish : 29 October 2026, 9:29 pm Posted by : Dr.K.Suresh Editor

చారాల ఉన్నత పాఠశాలలో ఉమ్మడి చిత్తూరు జిల్లా స్థాయి కబడ్డీ ఎంపికలు ఘనంగా ప్రారంభం!

-550 మందికి పైగా క్రీడాకారులు, కోచ్‌ల హాజరు..

-బాలురు, బాలికల విభాగాల్లో 16 మందికి చొప్పున ఎంపిక.

చౌడేపల్లి, అక్టోబర్ 29, సత్య వెలుగు న్యూస్:చౌడేపల్లి మండలంలోని చారాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వేదికగా అండర్-14 బాలబాలికల ఉమ్మడి చిత్తూరు జిల్లా స్థాయి కబడ్డీ జట్టు ఎంపిక పోటీలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపుతూ నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని మండల విద్యాశాఖాధికారి కేశవరెడ్డి, అన్నమయ్య జిల్లా స్కూల్ గేమ్స్ సెక్రటరీ రమేష్ బాబు, క్రిస్టిలు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

550 మందికి పైగా హాజరు

ఈ ఎంపిక పోటీలకు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 400 మంది బాలబాలికలు, 150 మందికి పైగా కోచ్‌లు, మేనేజర్లు హాజరయ్యారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారుల్లో బాలుర విభాగం నుంచి 16 మందిని, బాలికల విభాగం నుంచి 16 మందిని తుది జట్టుకు ఎంపిక చేశారు. ఎంపికైన క్రీడాకారులకు ప్రత్యేక శిక్షణ శిబిరం నిర్వహించనున్నారు.

రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా జట్టు

నవంబర్ చివరి వారంలో కృష్ణా జిల్లాలోని అవనిగడ్డలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో ఎంపికైన క్రీడాకారులు ఉమ్మడి చిత్తూరు జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ పోటీల ద్వారా ప్రతిభావంతులైన క్రీడాకారులకు రాష్ట్ర స్థాయిలో తమ నైపుణ్యాన్ని ప్రదర్శించే అవకాశం లభించనుంది.

దాతలకు ప్రత్యేక అభినందనలు

ఎంపిక పోటీల నిర్వహణకు ఆర్థిక సహాయం అందించిన మేకల చిన్నేపల్లి పాఠశాల పూర్వ విద్యార్థి సుజన్ రాజు, చౌడేపల్లి దొరస్వామి కుమారుడు ధర్మ తేజలను పాఠశాల యాజమాన్యం, అధికారులు ప్రత్యేకంగా అభినందించారు. క్రీడల అభివృద్ధికి దాతలు అందించిన సహకారం ప్రశంసనీయమని పేర్కొన్నారు.

పాల్గొన్న ప్రముఖులు

ఈ కార్యక్రమంలో పుదీపట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పద్మజ, ఏ.కొత్తకోట ప్రధానోపాధ్యాయురాలు నాగ మల్లిక, మేకల చిన్నేపల్లి ప్రధానోపాధ్యాయుడు చంద్రశేఖర్, చౌడేపల్లి ప్రధానోపాధ్యాయుడు ఉమా శంకర్ పాల్గొని క్రీడాకారులను ప్రోత్సహించారు.

అలాగే విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయులు రామచంద్ర, వెంకటేష్, సుబ్రహ్మణ్యం, అజయ్ కుమార్, సురేష్, నూరుద్దీన్, మనీతో పాటు చారాల పాఠశాల ఉపాధ్యాయులు సహదేవయ్య, నారాయణ, నాగరాజా, రమణ బాబు, రూబీ రాణి, ప్రతిమ, శరత్ చంద్ర, మార్ కొండయ్య తదితరులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వి. రేణుక, వ్యాయామ ఉపాధ్యాయుడు ఆర్. రాజేంద్ర బాబు వెల్లడించారు.