కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి గెలుపే లక్ష్యంగా ప్రభావతమ్మ ప్రచారానికి సిద్ధం!
-చిల్లకూరులో వైఎస్సార్సీపీ నాయకుల ప్రెస్మీట్.. -పార్టీ శ్రేణులకు ఐక్యతతో పనిచేయాలని పిలుపు పెళ్లకూరు, అక్టోబర్ 27,సత్య వెలుగు న్యూస్:పెళ్లకూరు మండలంలో జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ సందడి నెలకొంది. మాజీ ఎన్డీడీసీబీ చైర్మన్, వైఎస్సార్సీపీ నాయకుడు కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి జెడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడంతో పార్టీ శ్రేణుల్లో ఎన్నికలపై చర్చ మొదలైంది. ప్రస్తుతం ఆయన నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న నేపథ్యంలో, ఆయన సతీమణి కామిరెడ్డి ప్రభావతమ్మ ఎన్నికల ప్రచార బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. పెళ్లకూరు మండలం...